కాంగ్రెస్ పార్టీ నేత ఇంటిపై అధికారులు దాడులు..కారణం ఇదే?

0
82
Telangana Congress Party

కాంగ్రెస్ పార్టీ నేత, ఉమ్రా డెవలపర్స్ యజమాని యూసుఫ్ షరీఫ్ అలియాస్ కేజీఎఫ్ బాబు ఇంటి పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆదాయ పన్నుశాఖ అధికారులు శాఖ అధికారులు వసంతనగర్‌లోని ఆయన నివాసంతోపాటు ఆఫీస్ కార్యాలయాలపై మూడు బృందాలుగా అధికారులు దాడులు చేసిన ఘటన అందరిని భయాందోళనకు గురిచేసింది.

ఈయన వచ్చే ఏడాది కోలారు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని అనుకుంటున్నా క్రమంలో అతనిపై 40 మంది అధికారులతో మూడు బృందాలు ఏర్పడి ఐటీ దాడులు నిర్వహించారు. దీనికి గల కారణం ఏంటంటే..రెండు దశాబ్దాల క్రితం పాత సామగ్రిలు కొనుగోలు చేసి ఇతరులకు అమ్ముతూ వ్యాపార రంగంలో అడుగుపెట్టారు. విధాన పరిషత్ ఎన్నికల సమయంలో కేజీఎఫ్ బాబు ఆస్తి విలువ రూ.1,745 కోట్లుగా ఉండగా..ప్రమాణ పత్రంలో చూపించిన ఆస్తుల విలువలకు పొంతన లేకపోవడంతో ఈ దాడులు నిర్వహించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.