ప్లేస్ మార్చిన చంద్రబాబు

ప్లేస్ మార్చిన చంద్రబాబు

0
95

14న ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా అలాగే రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాలకు వ్యతిరేకంగా దీక్ష చేస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఈ దీక్షకు ఏపీ సర్కార్ షాక్ ఇచ్చింది…

దీంతో చంద్రబాబు నాయుడు ప్లేస్ మార్చాల్సి వచ్చింది… వాస్తవంగా చంద్రబాబు నాయుడు దీక్ష విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో చేయాల్సి ఉంది…. కానీ ఇక్కడ దీక్షకు అనుమతి ఇవ్వమని అధికారులు తేల్చి చెప్పారు..

ఇక్కడ కేవలం ప్రభుత్వ కార్యక్రమాలు తప్ప మరే ఇతర కార్యక్రమాలకు అనుమతి ఇవ్వమని తెలిపారు.. దీంతో టీడీపీ నాయకులు దీక్ష ప్లేస్ ను మార్చారు… విజయవాడలోని ధర్నా చౌక్ వైపు అలాగే మరికోన్ని చోట్లు వెతుకుతున్నారు… అయితే దీక్ష మటుకు ఆగదని అంటున్నారు టీడీపీ నాయకులు