తన కాన్వాయి దాడిపై స్పందించిన చంద్రబాబు…

తన కాన్వాయి దాడిపై స్పందించిన చంద్రబాబు...

0
92

ఏపీ మాజీ ముఖ్యమంత్రి నేడు అమరావతిలో పర్యటించిన సంగతి తెలిసిందే… ఈ పర్యటనలో ఆయనకు చేదు అనుభూతి ఎదురైంది… రాజధాని రైతులు అలాగే రాజధాని కూలీలు చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడమే కాకుండా ఆయన కాన్వాయిని కూడా అడ్డుకున్నారు…

అంతటి ఆగకుండా కొంతమంది కాన్వాయిపై రాళ్లతో దాడి చేశారు… ఈ దాడి పై చంద్రబాబ నాయుడు స్పందించారు… ప్రశ్నించే వారిపై దాడులు చేయడం సరికాదని అన్నారు…రాజధాని అమరావాతిపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని చెప్పారు…

రాజధాని అంశం ప్రభుత్వం పట్టించుకోకుందని మండిపడ్డారు… గతంలో తాము చేసిన అభివృద్ది చూసిన పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని కానీ ఇప్పుడు పెట్టుబడులు పెట్టాలంటే భయపడే స్థితికి వస్తున్నారని చంద్రబాబు నాయుడు అన్నారు…