ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు… గుంటురు జిల్లాలో అరెస్ట్ అయిన రైతులను ఆయన పరామర్శించారు… ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ… అమరావతిని మార్చడంలేదని వైసీపీ నాయకులు ఇప్పటికైనా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు…
వైసీపీ నాయకులు రియల్ ఎస్టెట్ కోసం రాజధాని మార్చుతున్నారని చంద్రబాబబు నాయుడు ఆరోపించారు… ఇప్పటికే విశాఖలో భూములన్ని కొనేశారని ఆరోపించారు… రియల్ ఎస్టెట్ కోసం రాజధానిని మార్చుతారా అని చంద్రబాబు ప్రశ్నించారు..
అమరావతిని నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు… బీసీజీ నివేదిక రాకముందే ఆ నివేదికలో ఏం వస్తాయో ముందుగానే మంత్రలు చెబుతున్నారని ఆయన ఆరోపించారు… చేతనైతే తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు పవాల్ విసిరారు