బాబు కాన్వాయిపై చెప్పులతో ఎందుకు దాడి చేశారో వైసీపీ క్లారిటీ…

బాబు కాన్వాయిపై చెప్పులతో ఎందుకు దాడి చేశారో వైసీపీ క్లారిటీ...

0
103

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న అమరావతి పర్యటన చేసిన సంగతి తెలిసిందే… ఈ పర్యటన చేసేమందు చంద్రబాబు నాయుడు రాజధాని రైతులకు అలాగే రాజధాని కూలీలకు క్షమాపణ చెప్పి పర్యటించాలని నిరసనలు తెలిపారు…

ఆయన కాన్వాయిని కూడా అడ్డుకుని రాళ్లతో చెప్పులతో దాడి చేశారు… ఈ దాడి వైసీపీ నాయకులు చేయించారని టీడీపీ నాయకులు మండిపడుతున్నారు… దీనిపై మంత్రి కొడాలి నాని క్లారిటీ ఇచ్చారు…

చంద్రబాబుపై దాడి చేయాలంటే అమరావతిలోనే చేయాలా అని ప్రశ్నించారు… రైతుల మసుగులో చంద్రబాబు పై దాడి చేయాల్సిన అవసరం తమకు లేదని అన్నారు… ప్రజలను మోసం చేశారు కాబట్టే వారు రాళ్లతో చెప్పులతో కొడుతున్నారని అన్నారు…