బాబు దీక్షకు పవన్ కల్యాణ్ వెళతారా సేనాని నిర్ణయం ఇదే

బాబు దీక్షకు పవన్ కల్యాణ్ వెళతారా సేనాని నిర్ణయం ఇదే

0
84

ఇటీవల ఇసుకపై పోరాటం చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ , తాజాగా ఇప్పుడు మళ్లీ అదే పోరాటంతో తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు వచ్చారు, బాబు రంగంలోకి దిగడంతో ఇప్పుడు అందరూ కూడా దీని గురించే చర్చిస్తున్నారు. చంద్రబాబునాయుడు 14వ తేదీనాటికి 12 గంటల నిరాహార దీక్ష చేయాలని అనుకుంటున్నారు. ఆ దీక్షలో కూర్చోవాల్సిందిగా పవన్ కల్యాణ్ ను కూడా ఆహ్వానిస్తున్నట్లు సమాచారం.

అయితే పవన్ లాంగ్ మార్చ్ కు బాబు లోకేష్ ఇద్దరూ వెళ్లలేదు.. మరి ఇఫ్పుడు పవన్ వస్తారా లేదా అంటే అది పెద్ద డౌట్ గానే అంటున్నారు అక్కడ సభ్యులు. అయితే పవన్ కల్యాణ్ మాత్రం వెళ్లాలి అని అనుకున్నా, పవన్ కల్యాణ్ అభిమానులు జనసేన నేతలు మాత్రం వద్దంటున్నారట .. ఇప్పటికే మన పార్టీపై విమర్శలు వస్తున్నాయని, చంద్రబాబు చెప్పింది పవన్ చేస్తున్నారు అనే ఆరోపణలు వైసీపీ చేస్తోంది .ఈ సమయంలో మనం ఆ పార్టీ నిరాహరదీక్షకు వెళితే వారి మాటలకు బలం చేకూరుతుంది అని చెబుతున్నారట. అందుకే బ్యాక్ స్టెప్ వేశారట పవన్ కల్యాణ్.