బాబుకు దూరం అవుతున్న అనుకుల మీడియా

బాబుకు దూరం అవుతున్న అనుకుల మీడియా

0
101

చంద్రబాబు ఏదైనా ఓ నిర్ణయం తీసుకుంటే ఆయన పార్టీ నేతలు ఎలా ప్రచారం చేస్తారో తెలియదు కాని, జనాల్లోకి మాత్రం తీసుకువెళ్లేది ఆయన మీడియాలు అనే చెప్పాలి … అయితే పేరుకి టీడీపీ పత్రికలు అని చెప్పకపోయినా కొన్ని మీడియాలు తెలుగుదేశం పార్టీ అధికార పత్రికలుగా జనాలు గుర్తించి బిరుదు ఇచ్చేశారు.. అయితే రేపు బాబు దీక్షకు ముహూర్తం పెట్టారు.. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు, జనాల తరలింపుకి ఏర్పాట్లు జరుగుతున్నాయి, అయితే ఏపీలో బాబు మీడియా మాత్రం ఇఫ్పుడు ఇసుక దీక్ష అవసరమా అని అంటోంది.

ఏపీలో ఇసుక కొరత తీరుతోంది. ఈ సమయంలో చంద్రబాబు ఎందుకు ఈ సాహసం అని కొన్నీ మీడియాల నుంచి వార్తలు కథనాలు వస్తున్నాయి.. ఏపీలో గతంలో కంటే ఇప్పుడు ఇసుక సమస్య తగ్గుతోంది అని తెలుగుదేశం అనుకూల పత్రిక పెద్ద బ్యానర్ ప్రచురించింది. అయితే ఇదిబాబు దీక్షకు ముందు రాయడం తెలుగుదేశంలో సంచలనం అయింది.ఆన్ లైన్ ఇసుక బుకింగ్ లో కూడా ఇప్పుడు ఎక్కువ సమయం ఇసుక లభ్యమవుతూ ఉందని వివరించింది, అంతేకాదు అక్రమంగా ఇసుక ఎగుమతి చేస్తే రెండు సంవత్సరాలు జైలు శిక్ష అని చెప్పారు దీంతో శాండ్ మాఫీయా ఆటలు కట్టినట్టే అని చెప్పింది.

చంద్రబాబు దీక్షకు కూర్చునే సమయంలో ఇలా ఆ పత్రిక వార్త రాయడం వెనుక రీజన్ ఏమిటి అనేది తెలుగుదేశం నేతలకే కాదు వైసీపీ నేతలకు కూడా ఆశ్చర్యం కలిగించింది.. బాబుకి అందరూ దూరం అవుతున్నారు కదా అని ఈ మీడియా కూడా దూరం అవుతుందా అనే వార్తలు వస్తున్నాయి, మొత్తానికి ఇసుక రేపిన దుమారం బాబుని దీక్షకు కూర్చొపెట్టింది.. రేపు చూడాలి టీడీపీ దీనిని ఎలా ప్రొజెక్ట్ చేస్తుందో