బాబు గారికి కొత్తగా పాఠాలు చెబుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు

బాబు గారికి కొత్తగా పా ఠా లు చెబుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు

0
80

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు నచ్చి వైసీపీలో చేరుతున్నారు చాలా మంది.. అయితే ఈ ఎన్నికల్లో 23 మంది మాత్రమే గెలిచారు టీడీపీ తరపున, వారిలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ
తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు.. ఆయన వైసీపీలో చేరకుండా ఉన్నారు అసెంబ్లీలో ప్రత్యేకంగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.

తాజాగా గుంటూరు పశ్చిమ తెలుగుదేశం ఎమ్మెల్యే మద్దాలి గిరి కూడా వైసీపీ కండువా కప్పుకునేలా ఉన్నారు.
సీఎం కార్యదీక్ష, పట్టుదల కలిగిన వ్యక్తి అని కొనియాడారు. వైసీపీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలపై కూడా ఆయన ప్రసంశలు కురిపించారు. తాజాగా సీఎం క్యాంప్ ఆఫీస్లో జగన్ను గిరి కలిశారు.

తన నియోజకవర్గ సమస్యలపై సీఎంను కలిశానని చెప్పారు. గుంటూరులో రోడ్ల పరిస్థితి అద్వాన్నంగా ఉందని సీఎంకు వివరించామన్నారు. గుంటూరుకు రూ.25 కోట్ల బకాయిలు రిలీజ్ చేయాలని అధికారులను సీఎం ఆదేశించారని తెలిపారు. రాష్ట్ర పరిస్థితులపై కూడా సీఎంతో చర్చించామన్నారు. ఇక పేదల పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్య గురించి టీడీపీ డబుల్ స్టాండ్ తీసుకుందని పేద విద్యార్దులు కచ్చితంగా మంచి విద్య పొందాలని తెలియచేశారు.

మొత్తానికి బాబు డవలప్ మెంట్ చేసి ఉంటే ఈ బాధ ఉండేది కాదు అని ఎమ్మెల్యే అన్నారు. మొత్తానికి ఈ ఎమ్మెల్యేలు అందరూ సైలెంట్ గా పార్టీ మారే సమయంలో ఇలా బాబుగారిని విమర్శిస్తూ, రాజకీయంగా పాఠాలు చెబుతున్నారు అని అంటున్నారు టీడీపీ నేతలు.