కడప టూర్ ముగిసిన తర్వాత చంద్రబాబు బిగ్ ప్లాన్

కడప టూర్ ముగిసిన తర్వాత చంద్రబాబు బిగ్ ప్లాన్

0
100

ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప జిల్లాలో పర్యటించనున్నారు ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి కడప ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు…

అక్కడినుంచి రోడ్డు మార్గంలో రాజంపేటకు చేరుకుని కార్యకర్తలతో పార్టీనేతలో సమావేశం నిర్వహిస్తారు… కడపలో చంద్రబాబు మూడు రోజులు పర్యటించిన తర్వాత 28న అమరావతిలో పర్యటించనున్నారు…

అమరావతి నిర్మాణంలో ఉన్న పలు భవనాలను రహదారులను పరిశీలించనున్నారు…. ఆ తర్వాత రాజధాని గ్రామాలలో పర్యటించనున్నారు చంద్రబాబు… కాగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రులు రాజధాని విషయంలో రోజుకు ఒక మాట మాట్లాడుతున్న సంగతి తెలిసిందే…