బాబు మధ్యలో ఎందుకు వెళ్లిపోతున్నారు

బాబు మధ్యలో ఎందుకు వెళ్లిపోతున్నారు

0
81

అసెంబ్లీ సమావేశాల సమయంలో ఇటు మాజీ మంత్రి లోకేష్ పై , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై సటైర్ల వర్షం కురిపిస్తోంది ప్రభుత్వం… తాను 40 ఏళ్ల సీనియర్ అనుభవం అని చెప్పే చంద్రబాబు కామెంట్లపై తీవ్రస్ధాయిలో వైసీపీ విమర్శలు చేస్తోంది.. మరీ ముఖ్యంగా 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉండటం మరో పక్క 151 మంది ఎమ్మెల్యేలు వైసీపీ వైపు ఉండటంతో తెలుగుదేశం వాయిస్ వినిపించలేకపోతున్నారు.

జగన్ ని టార్గెట్ చేద్దాము అని అనుకున్న సమయంలో ప్రతీ సారి కూడా చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు వైసీపీ నేతలు.. ఇక సభ నుంచి చంద్రబాబు చాలా సేపు తన ఛాంబర్ కు వెళ్లిపోతున్నారు అని విమర్శలు చేస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు.

గతంలో వైసీపీ పై ఇలాంటి కామెంట్లు చేసిన చంద్రబాబు ఇప్పుడు ఎందుకు ఇలాంటి పని చేస్తున్నారు అని అంటున్నారు అందరూ.. అయితే జగన్ తాజాగా మాత్రం టీడీపీ నేతలకు చుక్కలు చూపిస్తున్నారని పార్టీ తరపున టీడీపీ గొంతు ఎంత వినిపించినా, వినేవారు లేరు అంటున్నారు తెలుగుదేశం నేతలు.