బాబుని అక్కడ పంపాలి అని ఎన్టీఆర్ కోరిక – లక్ష్మీ పార్వతి

బాబుని అక్కడ పంపాలి అని ఎన్టీఆర్ కోరిక - లక్ష్మీ పార్వతి

0
86

ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి టీడీపీ అధినేత చంద్రబాబు పై సమయం చిక్కినప్పుడల్లా, ఆనాటి విషయాలు చెప్పి, బాబు ఎలాంటి రాజకీయాలు చేశాడో విమర్శిస్తారు.. తాజాగా ఆమె మాట్లాడుతూ తన భర్త ఎన్టీఆర్ బతికున్న రోజుల్లో చంద్రబాబునాయుడుపై ఆయన ఏం వ్యాఖ్యలు చేశారో వాటి గురించి ఆమె ప్రస్తావించారు.

మళ్లీ ప్రజలు గెలిపించి తాను ముఖ్యమంత్రి అయితే, చంద్రబాబుని అండమాన్ జైలుకి పంపాలని ఉంది అని తనతో ఎన్టీఆర్ అనేవారు అని గుర్తు చేసుకున్నారు ఆమె.. అలాంటి రోజు బాబుకి త్వరలో వస్తుంది అని అంటున్నారు ఆమె.. ఇక ఏపీలో గత పాలకులపై వేసిన సిట్ అన్నీ విషయాలు తేలుస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేశారు.

చంద్రబాబు, అచ్చెన్నాయుడు, సుజనా చౌదరి.. ఈ ముగ్గురూ జైలుకు వెళ్లడం చూడాలని ఉందని చెప్పారు. వీరు చేసిన అక్రమాలు అన్నీ బయటకు వస్తాయి అని విమర్శించారు ఆమె.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలుగుతో పాటు ఇంగ్లీష్ కు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు అని తెలిపారు.