బాబుని నమ్మి వచ్చారు కాని అడ్డంగా మునిగిపోయిన దంపతులు

బాబుని నమ్మి వచ్చారు కాని అడ్డంగా మునిగిపోయిన దంపతులు

0
118

రాజకీయంగా తీసుకునే ఒక రాంగ్ స్టెప్ పొలిటికల్ గా తలరాతని మార్చేస్తుంది అంటే నమ్మి తీరాల్సిందే…చాలా మందిని ఉదాహరణగా చెప్పవచ్చు… మళ్లీ రాజకీయాల్లో కనిపించకుండా చాలా మంది అలాగే మారిపోయారు..తాజాగా ఓ రాజకీయ దంపతులని చూస్తే అదే అనిపిస్తుంది.. టీడీపీలో ఉన్న ఈ సీనియర్ దంపతుల రాజకీయ జీవితానికి ఎండ్ కార్డ్ పడిందా అనే అనుమానం వస్తుంది.కాంగ్రెస్ పార్టీలో అత్యధిక పదవులు అదిరోహించిన మాజీ కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి నెల్లూరు డిసిసి అధ్యక్షుడుగా పని చేసిన ఆమె భర్త పనబాక కృష్ణయ్యలు రాజకీయంగా అంత యాక్టీవ్ గా లేరు.

2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్దితి దారుణంగా మారింది.. దీంతో ఆమె రాజకీయంగా చాలా సైలెంట్ అయ్యారు.2019 ఎన్నికల సమయంలో ఆమె తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే వైసీపీ నుంచి ఆహ్వనం వచ్చినా ఆమె చేరలేదు. ఇక తెలుగుదేశం పార్టీ ఆమెకు తిరుపతి సీటు ఇవ్వడం జరిగింది. అక్కడ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో ఆ దంపతులు రాజకీయంగా యాక్టీవ్ గా లేరు. ఇక మరో ఐదు సంవత్సరాలు పనబాక కుటుంబం రాజకీయంగా టీడీపీలో ముందుకు సాగుతారు అని ఎవరూ భావించడం లేదు, మొత్తానికి వారు వేసిన రాంగ్ స్టెప్ మరో ఐదు సంవత్సరాలు రాజకీయంగా సైలెంట్ అయ్యేలా చేసింది అంటున్నారు వారి సన్నిహితులు…అయితే వీరి కేడర్ మాత్రం కొందరు వైసీపీ వైపు వెళుతున్నారట.