దూకుడు పెంచిన బాబు మరో సంచలన హామీ

దూకుడు పెంచిన బాబు మరో సంచలన హామీ

0
99

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు అనే చెప్పాలి.. తెలుగుదేశం నేతలు అందరూ ఓ వైపు బాబు ఓ వైపు అనేలా ప్రచార దూకుడు చూపిస్తున్నారు.. జగన్ కు ఆయన కుటుంబం నుంచి ప్రచారం చేస్తున్న వారికి వైసీపీ నేతలకు ఎక్కడికక్కడ కౌంటర్లు ఇస్తున్నారు.. ఇక తాజాగా బాబు పలు హామీలు ఇచ్చారు ప్రజలకు.

తునిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. డ్వాక్రా సంఘాలు తనకు మానస పుత్రిక అని, నాడు ఎగతాళి చేసినవారు ఇప్పుడు ముక్కున వేలేసుకున్నారని బాబు విమర్శించారు. మీ ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటా మీ పిల్లల పెళ్లిళ్లకు ఇక పై లక్ష రూపాయలు ఇస్తాం అని దర్జాగా పెళ్లి చేసి పంపించాలి అని చెప్పారు, మీరు మందులు కొనుక్కోవాలి అంటే ఆస్పత్రికి వెళ్లక్కర్లేదు మందుల షాపులో తీసుకోండి డబ్బులు మేమే చెల్లిస్తాం అని హామీ ఇచ్చారు.. రాబోయే రోజుల్లో ఇంటింటికి కుళాయి ద్వారా నీళ్లిస్తామని చంద్రబాబు అన్నారు. కోటి మంది ఆడబిడ్డలకు పసుపు కుంకుమ ఇచ్చామని, 4వ తేదీన రెండో విడత డబ్బులు జమ చేస్తామని చంద్రబాబు తెలిపారు. పేదల గృహాల బకాయిలు రూ.9300 కోట్లను మాఫీ చేస్తున్నామని, 43 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరిందని చంద్రబాబు అన్నారు. పేదల ఇంటికి 10 లక్షలు ఖర్చు చేస్తున్నాము అన్నారు, ప్రతీ ఐదు సంవత్సరాలకు మూడుసార్లు పసుపు కుంకుమ ఇస్తాము అని ఆయన తెలియచేశారు.