జగన్ పై బాబు కొత్త స్లోగన్ అదుర్స్

జగన్ పై బాబు కొత్త స్లోగన్ అదుర్స్

0
122

తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారంలో సరికొత్త స్ట్రాటజీలు ఉపయోగిస్తోంది.. బాబు రాజకీయ ఎత్తులు వేయడంలో దిట్ట అని తెలుసు. ఈసారి ఆయన ప్రచారంలో స్టైల్ మార్చారు. జగన్ అధికారంలోకి వస్తే కేసీఆర్ మోదీ కలిసి ఏపీకి అన్యాయం చేస్తారు, ఏపీని తాకట్టు పెట్టే పనులు జగన్ చేస్తాడు అనేది మెయిన్ అజెండాగా జగన్ గురించి బాబు ప్రచారం చేస్తున్నారు.. అలాగే రైతులకు యువతకు మహిళలకు తమ ప్రభుత్వం చేసిన అభివృద్ది గురించి చెబుతున్నారు.. ఇవన్నీ కూడా రాజకీయంగా చర్చకు వస్తున్న అంశాలు..

ముఖ్యంగా జగన్ చేసిన రాజకీయాలు ప్రజలకు అందరికి తెలిసేలా బాబు ప్రచారం చేస్తున్నారు.. జగన్ దగ్గర రౌడీలు అలాగే రాజకీయాలు నేర్చని నాయకులు జైలు పక్షులే అని సటైర్ వేశారు చంద్రబాబు.. అసలు ఎందుకు తాము జగన్ కు ఓటు వేయాలి అని ఆలోచించుకునేలా, బాబు మాటలు జనాల్లో ఆలోచన రేకెత్తిస్తున్నారు.. సీఎం కుమారుడిగానే ఇంత అవినీతి చేస్తే ఇక సీఎం అయితే దోచుకోవడానికి అడ్డు ఎవరూ ఉండరు అనేలా రెచ్చిపోతాడు జగన్ అనేలా జనాలకు తెలియచేస్తున్నారు చంద్రబాబు ..మొత్తానికి బాబు ప్రచారంతో జనాలకు కొత్త ఆలోచన వస్తోంది అసలు ఇంత లాజిక్ ఉందా అని ప్రజలు ఆలోచిస్తున్నారు.