బాబును టెన్షన్ పెట్టిస్తున్న మరో కీలక నేత

బాబును టెన్షన్ పెట్టిస్తున్న మరో కీలక నేత

0
83

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ తరపున తమ వాయిస్ ను గట్టిగా వినిపించారు తమ్ముళ్లు… అయితే ఈ ఎన్నికల్లో అధికారం కోల్పోవడంతో మీడియాకు దూరం అయ్యారు….

ముఖ్యంగా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తన వాయిస్ ను ప్రత్తిపాటి పుల్లారావు గట్టిగా వినిపించారు.. ఈ ఎన్నికల్లో ఆయన ఓడిపోవడంతో పార్టీ కార్యాకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు… దీంతో ఆయన త్వరలో టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలోకైనా లేదంటే వైసీపీలో చేరాలని చూస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…

ఇప్పటికే బీజేపీ నేతలతో కూడా ఆయన చర్చలు కూడా జరిపినట్లు వార్తలు వస్తున్నాయి… కాగా ఇప్పటికే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే ఇప్పుడు ఆయన వేసిన బాటనే ఇతర నేతలకు పూల బాటలా మారిందని అంటున్నారు రాజకీయ మేధావులు..