చంద్రబాబు సభకు ఆ కీలక నేత డుమ్మా బీజేపీలో చేరేందుకేనా…

చంద్రబాబు సభకు ఆ కీలక నేత డుమ్మా బీజేపీలో చేరేందుకేనా...

0
104

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటిస్తున్నారు… ఈ మూడు రోజుల్లో చంద్రబాబు ఇప్పటికే ఒక రోజు పూర్తి చేసుకున్నారు…

నేటితో రెండో రోజు కూడా పూర్తికానుంది అయితే నిన్నచాలామంది నేతలు చంద్రబాబు సభకు డుమ్మాకొట్టారు ఎమ్మెల్సీ బీటెక్ రవి శివనాథరెడ్డిల సమావేశానికి హాజరు కాలేదు… అలాగే వరదరాజులు రెడ్డి విజయమ్మ సుగవసి ప్రసాద్ పాలకొండ్రాయుడు, ఆయన వర్గీయులు సైతం హాజరు కాలేదు…

కాగా ఇటీవలే మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే… ఇదే క్రమంలో త్వరలో ఆయన సోదరుడు శివనాథరెడ్డి కూడా బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి అందుకే ఆయన బాబు సభకు డుమ్మాకొట్టారని అంటున్నారు స్థానికంగా