Flash: శివసేన నేత సంజయ్ రౌత్ కు ఎదురుదెబ్బ

0
74

మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం మధ్య శివసేన నేత సంజయ్ రౌత్ కు ఎదురు దెబ్బ తగిలింది. భూ కుంభకోణం కేసులో శివ‌సేన సీనియ‌ర్ నేత సంజ‌య్ రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) స‌మ‌న్లు పంపింది. ముంబైలోని ఓ భ‌వ‌న స‌ముదాయ పున‌ర్నిర్మాణ ప‌నులకు సంబంధించిన న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో రేపు విచార‌ణ‌కు రావాల‌ని ఆదేశించింది.

కాగా ఈ నోటీసులపై సంజయ్ రౌత్ తన ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తనకు ఇప్పుడే తెలిసింది అన్నారు. తాము బాలాసాహెబ్ శివసైనికులమని, ఇప్పుడు పెద్ద యుద్ధం చేస్తున్నామని, ఇది తనను అడ్డుకునే కుట్ర అని మండిపడ్డారు.” నువ్వు నా తల నరికినా.. నేను గౌహతి మార్గంలో వెళ్ళను.. నన్ను అరెస్టు చేయండి.. జైహింద్” అంటూ సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు.

https://twitter.com/rautsanjay61?