చంద్రబాబుకు బ్యాడ్ టైమ్

చంద్రబాబుకు బ్యాడ్ టైమ్

0
110

తెలుగుదేశం పార్టీకి నెల్లూరు జిల్లా కావలిలో బిగ్ షాక్ లు తగిలే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు… ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉన్న కావలి నియోజకవర్గంలో ఇప్పుడు ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి…

టీడీపీ నుంచి ముఖ్య నేతలు వారి అనుచరులు వైసీపీలోకి వెళ్లగా తాజాగా మరికొందరు నేతలు ఇదే వలసబాట పట్టేందుకు సిద్దమయ్యారు… 2019 ఎన్నికల తర్వాత టీడీపీ అన్నీ తానై ఉన్న బీదమస్తార్ రావు కొద్దిరోజుల క్రితం ఆయన వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే…ఆయనతోపాటు టీడీపీ కార్యకర్తలు కూడా వైసీపీ తీర్థం తీసుకున్నారు… అయితే ఆయన సోదరుడు మాత్రం టీడీపీలో ఉన్నారు… గతంలో టీడీపీ తరపున చక్రం తిప్పిన అన్నదమ్ములు మస్తాన్ రావు బీదరవి చంద్రలు ఇప్పుడు రాజకీయ శత్రువులుగా మారారు..

వైసీపీ ఎమ్మెల్యే, అలాగే మస్తాన్ రావులు కావలిలో తమదైన శైలిలో రానిస్తూ టీడీపీకి చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తూ తమ్ముళ్లను పార్టీలోకి చేర్చుకుంటున్నారు… ఇక రానున్న రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగితే నియోజకవర్గంలో టీడీపీ ఖాళీ అవ్వడం ఖాయం అని అంటున్నారు..