మరోసారి చేతులకు పని చెప్పిన బాలయ్య….

మరోసారి చేతులకు పని చెప్పిన బాలయ్య....

0
97

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు జయప్రకాశ్ రెడ్డి నిన్న ఉదయం గుంటూరులోని తన నివాసంలో గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే… సూమారు మూడు దశాబ్దాల పాటు వందకు పైగా సినిమాల్లో నటించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను అలరించారు…

ఆయన నటించిన చివరి చిత్రం సరిలేరు నీకెవ్వరు… అనిల్ రావిపుడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మహేష్ బాబు రష్మిక హీరో హీయిన్లుగా నటించారు… ఇదిలా ఉండగా నందమూరి బాలకృష్ణ జయప్రకాశ్ రెడ్డి కుటుంబానికి అర్థిక సహాయం అందించారు…

జయప్రకాశ్ రెడ్డి మరణవార్త విని దిగ్భ్రింతి వ్యక్తం చేసిన బాలయ్య ఒకడుగు ముందుకు వేసి ఆయన కుటుంబానికి 10 లక్షలు ఆర్ధిక సహాయం అందించి తన మానవత్వం చాటుకున్నారు…