కుటుంబ సభ్యులకు కాదని నమ్మిన నేతకు జగన్ కీలక పదవి

కుటుంబ సభ్యులకు కాదని నమ్మిన నేతకు జగన్ కీలక పదవి

0
32

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన వెన్నంటి ఉన్న వారికి ఏదో రకంగా పదవి దక్కేలా చేస్తుంటారు… కొన్ని సమీకరణాల నేపథ్యంలో చాలా మందికి జగన్ పదవి ఇవ్వలేకపోయారు… అయినా కూడా వారు వైసీపీ విజయానికి ఎంతో కృషి చేశారు… అందులో ఒకరు రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి ఒకరు…

ఈయన తొలినుంచి వైఎస్సార్ ఫ్యామిలీను అంటిపెట్టుకుని ఉన్నారు… 2014 ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసి ఓటమి చెందాను… ఆతర్వాత అనుహ్యంగా అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే మేడ మళ్లికార్జున రెడ్డి వైసీపీ తీర్థం తీసుకున్నారు… దీంతో 2019 ఎన్నికల్లో ఆకేపాటి దక్కాల్సిన టికెట్ కాస్త మేడకు కన్ఫామ్ చేసింది అధిష్టానం… దీంతో ఆయన పార్టీ గెలుపుకోసం కృషి చేశారు…

ఇక పార్టీ అధికారంలోకి రావడంతో అమర్ నాధ్ రెడ్డికి టీటీడీ చైర్మన్ పదవి దక్కుతుందని అందరు అనుకున్నారు… అయితే ఆ పదవి వైవీ సుబ్బారెడ్డి ఇచ్చారు జగన్… తాజాగా అమర్ నాథ్ రెడ్డికి మరో కీలక పదవి అప్పగించేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి.. ఈ పదవి విషయంలో తమ కుటుంబికుల నుంచి ఒత్తిడి వచ్చినా ఆకేపాటికే ఈ పదవి ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి