పాన్ కార్డు ఇలా వాడితే మీకు 10 వేల ఫైన్ తప్పక తెలుసుకోండి

పాన్ కార్డు ఇలా వాడితే మీకు 10 వేల ఫైన్ తప్పక తెలుసుకోండి

0
40

బ్యాంకు ఖాతా ఓపెన్ చేసిన సమయంలో ఇప్పుడు కచ్చితంగా పాన్ కార్డ్ అడుగుతున్నారు, ముఖ్యంగా పాన్ కార్డ్ లేకపోతే చాలా ఇబ్బంది.ఆర్ధికంగా ఏ పని చేయాలన్నా 50 వేల కన్నా అదనంగా అకౌంట్లో డిపాజిట్ చేయాలి అన్నా కచ్చితంగా పాన్ ఉండాలి, అయితే పాన్ కార్డ్ ఇప్పుడు చాలా సులువుగా వచ్చేస్తోంది.

కాని గతంలో కొందరు పాన్ కార్డులు రెండు కూడా మెయింటైన్ చేసిన వారు ఉన్నారు, ఆర్ధిక మోసాలకు పాల్పడాలనుకునేవారు ఇలా రెండు పాన్ కార్డులు తీసుకున్న సందర్భాలు ఎక్కువ అని పోలీసులు చెబుతున్నారు.

అయితే మీ దగ్గర రెండు పాన్ కార్డులు ఉంటే కచ్చితంగా ఒకటి వెంటనే డిపార్ట్ మెంట్ వారికి సరెండర్ చేయాలి.. మీ పాన్ కార్డు పోతే మళ్లీ కొత్త పాన్ కార్డుకు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. డూప్లికేట్ పాన్ కార్డ్ తీసుకుంటే చాలు. పాత నెంబర్పైనే డూప్లికేట్ పాన్ కార్డ్ వస్తుంది. ఒక వేళ మీరు రెండు పాన్ కార్డులు వేరు వేరే నెంబర్లతో ఒకే పేరుమీద వాడితే మాత్రం చాలా డేంజర్, ఇలా వాడితే వారికి 10 వేల జరిమానా పడుతుంది.ఆదాయపు పన్ను చట్టం-1961 ప్రకారం రెండు పాన్ కార్డులు మెయింటైన్ చేస్తే రూ.10,000 జరిమానా చెల్లించక తప్పదు.

దాని కోసం మీరు ఏం చేయాలంటే.
ముందుగా NSDL వెబ్సైట్ ఓపెన్ చేయండి. అక్కడ Application Type డ్రాప్ డౌన్లో Changes or Correction in existing PAN Data/Reprint of PAN Card ఆప్షన్ ద్వారా ఈ ప్రాసెస్ చేయండి.