బ్రేకింగ్ హిందూపురంలో బాలయ్య మిస్సింగ్

బ్రేకింగ్ హిందూపురంలో బాలయ్య మిస్సింగ్

0
85

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు కుమారుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కనిపించడంలేదా… అంటే అవుననే అంటున్నారు అయన ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం ప్రజలు… హోరా హోరీగా జరిగిన 2019 ఎన్నికల్లో మరోసారి హిందూపురం నియోజక వర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి గెలిచారు బాలయ్య… 14 అసెంబ్లీ స్థానాల్లో కేవలం టీడీపీ రెండు సీట్లను గెలుచుకుం…ది అందులో ఒకటి హిందూపురం…

అయితే అయన ఎమ్మెల్యే అయిన తరువాత చుట్టం చూపుగా ఒక్కసారి మాత్రమే హిందూపురానికి వచ్చారని ఆ తరువాత నుంచి అయన జాడ హిందూపురంలో కానరాలేదని అక్కడి ప్రజలు వాపోతున్నారు… అంతే కాదు గతంలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కూడా బాలయ్య తన నియోజకవర్గంపై పెదవి విప్పలేదు..

ప్రస్తుతం అయన వరుస సినిమాల్లో బిజీ అయ్యారు… సినిమా షూటింగ్‌లంటూ ఆయన విదేశాలలో పర్యటిస్తున్నారే తప్ప నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టిసారించలేదు. దీంతో హిందూపురం నియోజక వర్గంలో ప్రజలు కనీస అవసరాలకోసం నానా అగసాట్లు పడుతున్నారు. ఎన్నికల సమయంలో ఇక నుంచి తాము ఇక్కడే ఉంటామని చెప్పి ప్రచారం చేశారు…

దీంతో ప్రజలు మరో సారి ఆయనకు పట్టం కట్టారు అయితే ఎన్నికల తర్వాత ఆయన జాడ కానరాలేదు… ఒకవైపే చూడు రెండో వైపు చూడకు అన్న డైలాగ్ లా బాలయ్య కేవలం సినిమాపైనే దృష్టిపెడుతున్నారు తప్ప హిందూపురం వైపు దృష్టి పెట్టకున్నారు… దీంతో కొన్నిప్రాంతాల్లో బాలయ్య మిస్సింగ్ అని బోర్డు కూడా దర్శనం