గుట్కా బ్యాచ్ తో బంగారు తెలంగాణ సాధిస్తారా కేసీఆర్ ?

0
84

గుట్కా బ్యాచ్ తో బంగారు తెలంగాణ సాధిస్తారా కేసీఆర్ ? గుట్కాలు తింటున్న మంత్రులు ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారు ?” అని నిలదీశారు ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్. తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్, గంగుల కమలాకర్‌ బ్యాన్ చేసిన గుట్కాని భహిరంగా ప్రదేశాల్లో తింటు వీడియోకి చిక్కారు. దీనిపై స్పదించిన దాసోజు శ్రవణ్ .. మంత్రుల తీరుని తీవ్రంగా ఆక్షేపించారు. రాజ్యంగం మీద ప్రమాణం చేసిన మంత్రులు ఇంత నిస్సిగ్గుగా బ్యాన్ చేసిన మత్తు పదార్ధాలని తినడాన్ని యావత్ తెలంగాణ సమాజం తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు దాసోజు.

”2012 కర్ణాటక అసెంబ్లీలో బిజెపికి చెందిన మంత్రులు లక్ష్మణ్ సవాడి, సిసి పాటిల్, కృష్ణ పాలేమార్ నీలి చిత్రాలు చూస్తూ పట్టుబడ్డారు. నాటి ముఖ్యమంత్రి సదానంద్ గౌడ్ వెంటనే స్పందించి మంత్రుల్ని రాజీమానా కోరి వారిని మంత్రుల పదవుల నుంచి బర్త్ రఫ్ చేశారు. కేసీఆర్ ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలి. దేనికి పనికిరాని సన్నాసులని మంత్రులని చేసిన కేసీఆర్… ఇంత నిర్లజ్జగా చట్టాన్ని ఉల్లఘించి బ్యాన్ చేసిన మత్తు పదార్ధాలు తింటున్న మంత్రులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? ఇలాంటి గుట్కా బ్యాచ్ నేతృత్వంలో బంగారు తెలంగాణ సాధిస్తారా ? ఇలాంటి గుట్కా మంత్రులని వెంటనే క్యాబినేట్ నుంచి బర్త్ రఫ్ చేయాలి ” అని డిమాండ్ చేశారు దాసోజు.

తెలంగాణాలో పొగాకు గుట్కా బ్యాన్ చేశారు. మరి ఈమంత్రులకు ఎలా దొరికింది? ఎవరు స్మగుల్ చేశారు ? హైదరాబద్ డ్రగ్స్ ని హబ్ గా మారింది. పెద్ద ఎత్తున గంజాయి హెరాయిన్, చేరాస్ ఇలా అనేక డ్రగ్స్ కు హైదరాబాద్ అడ్డగా మారింది. ఎలా దొరుకుతున్నాయి ? ఎవరు స్మగుల్ చేస్తున్నారు ? బ్యాన్ చేసిన పదార్ధాలు మంత్రుల వరకూ ఎలా వచ్చాయి? మంత్రులే నిషేదిత గుట్కాలు తీసుకుంటుంటే .. మిగతా ప్రజలకు ఎలాంటి సందేశం వెళుతుంది?” అని ప్రశ్నించారు దాసోజు

‘టీఆర్ఎస్ ప్రభుత్వ చేతకాని తీరుతో ఇప్పటికే హైదరాబద్ డ్రగ్స్ కి అడ్డగా మారింది. పబ్స్ , హుక్కా సెంటర్లు డ్రగ్స్ పంపిణీకి కేంద్రాలుగా మారిపోయాయి. చాలా మంది యువత భవిష్యత్ అంధకారంలోకి వెళుతుంది. డిజీపీ మహేందర్ రెడ్డి , కమీషనర్ అంజన్ కుమార్ .. ఈ విషయంలో భాద్యత వ్యవహరించాలి. బ్యాన్ చేసిన గుట్కాలు తిన్న మంత్రులపై ఎన్ డి పి ఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలి. మంత్రులపై చర్యలు తీసుకున్నట్లయితే ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు కళ్ళెం వేసినట్లౌతుందని తెలియజేశారు దాసోజు శ్రవణ్.