భారీగా పెరిగిన ఫైన్లు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే ఇక భారీ ఫైన్

భారీగా పెరిగిన ఫైన్లు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తే ఇక భారీ ఫైన్

0
56

ఈ రోజుల్లో చాలా మంది సేఫ్టీ విష‌యంలో ప్రభుత్వం ఎంత చెబుతున్నా ప‌ట్టించుకోవ‌డం లేదు.. ముఖ్యంగా హెల్మెట్ ధ‌రించాలి అని చెబుతున్నా వాహ‌నం వంద కిలోమీట‌ర్ స్పీడ్ న‌డుపుతారు, కాని హెల్మెట్ పెట్టుకోరు, ఇంకొంద‌రు సిగ్న‌ల్ జంప్ చేస్తారు, మ‌రికొంద‌రు త్రిబుల్ రైడ్ చేస్తారు, ఇంకొంద‌రు ఆర్సీ ఇన్సూరెన్స్ తీసుకురారు ఇలా ఎన్నో కేసులు వ‌స్తున్నాయి.

అలాగే ఈ మ‌ధ్య సెల్ ఫోన్ మాట్లాడుతూ బండి కారు న‌డిపేవారు చాలా మంది ఉన్నారు.
దీంతో ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం మరికొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేస్తే ఇకపై వాహనదారులకు రూ.10 వేలు జరిమానా విధించాలని నిర్ణయించింది.

అలాగే హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనం నడిపినా
కారు సీట్ బెల్ట్ లేక‌పోయినా
రాష్ డ్రైవింగ్ చేసినా 500 నుంచి 1000 జ‌రిమానా విధిస్తారు
పార్కింగ్ నిబంధనలు అతిక్రమిస్తేరూ.500, రెండోసారి రూ.1500..
లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.5000,
డిజైన్లు అక్ర‌మాలు బండి మార్పులు చేస్తే ల‌క్ష జ‌రిమానా విధిస్తారు.