భారీగా పెరిగిన బంగారం ధర షాకిస్తున్న వెండి

భారీగా పెరిగిన బంగారం ధర షాకిస్తున్న వెండి

0
103

బంగారం ధర పరుగులు పెడుతోంది, ఎక్కడా తగ్గుముఖం పట్టడం లేదు, గడిచిన మూడు రోజులుగా బంగారం ధరపెరుగుదల కనిపిస్తోంది, ఇక వెండి ధర కూడా పెరుగుతోంది, బంగారం వెండి ధరలు భారీగా పెరుగుదల నమోదు చేస్తున్నాయి, ఇక మన ఇండియన్ మార్కెట్లో కూడా పెరుగుదల నమోదు చేసింది.

హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. గత ఐదు రోజుల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.830 పెరుగుదలతో రూ.52,380కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.770 పెరిగింది. దీంతో ధర రూ.48,020కు చేరింది.

బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. గత 5 రోజుల్లో కేజీ వెండి ధర రూ.690 పెరిగింది బంగారం ధర వచ్చే రోజుల్లో మరింత పెరుగుతుందా అంటే వచ్చే రోజుల్లో తగ్గే సూచనలు ఉన్నాయి అంటున్నారు బులియన్ వ్యాపారులు.