భారీగా పెరిగిన బంగారం వెండి ధర – ఈ రోజు రేట్లు ఇవే

భారీగా పెరిగిన బంగారం వెండి ధర - ఈ రోజు రేట్లు ఇవే

0
37

బంగారం ధర చూస్తే నాలుగు రోజులుగా పెరుగుతూ ఉంది.. గత వారం తగ్గుతూ ఉన్న పుత్తడి ధర ఈ వారం మాత్రం ఆకాశాన్ని అంటింది.. భారీగా ధరలు పెరుగుతున్నాయి.. బంగారం ఇలా ఉంటే వెండి ధర కూడా భారీగా పెరుగుతోంది. ఓసారి మార్కెట్ రేట్లు చూస్తే గత వారం కంటే 1500 రూపాయలు పెరుగుదల నమోదు చేసింది పుత్తడి ధర. మరి నేడు మార్కెట్లో బంగారం ధర ఎలా ఉంది అనేది చూద్దాం.

 

 

హైదరాబాద్ మార్కెట్లో శనివారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.560 పెరుగుదలతో రూ.47,460కు ట్రేడ్ అవుతోంది.. ఇక ఆర్నమెంట్ బంగారం ధర చూస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర పెరిగింది… రూ.500 పెరుగుదలతో రూ.43,500కు చేరింది.

 

బంగారం ధర పెరిగితే.. వెండి రేటు కూడా పెరిగింది. కిలో వెండి ధర 800 పెరగడంతో దాదాపు కిలో 72100 కు చేరింది, ఇక వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు మరింత పెరుగతాయి అంటున్నారు బులియన్ వ్యాపారులు. అయితే బులియన్ మార్కెట్లో దాదాపు వెండి 3000 బంగారం 1800 పెరిగింది ఈ నెలలో.