భారీగా పెరుగుతున్న బంగారం వెండి ధరలు – నేటి మార్కెట్ ధరలు ఇవే

భారీగా పెరుగుతున్న బంగారం వెండి ధరలు - నేటి మార్కెట్ ధరలు ఇవే

0
32

గత వారం తగ్గిన బంగారం ధర ఈ వారం పరుగులు పెట్టింది.. బంగారం ధర భారీగా పెరుగుతోంది, ఈ వారం నాలుగు రోజులు బంగారం ధర కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తూ, రోజూ రెండు నుంచి మూడు వందల పెరుగుదల నమోదు చేసింది.. తగ్గినట్లే తగ్గి మళ్లీ బంగారం ధర ఆకాశాన్ని అంటుంతోంది.. బంగారం ధర ఇలా ఉంటే వెండి రేటు కూడా చుక్కలు చూపిస్తోంది.. సో బంగారం బులియన్ మార్కెట్లో రేటు ఎలా ఉంది అనేది చూద్దాం.

 

 

హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.370 పెరుగుదలతో రూ.46,900కు ట్రేడ్ అవుతోంది …ఈనెలలో ఇదే అత్యధిక రేటు… అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.350 పెరుగుదలతో రూ.43,000కు ట్రేడ్ అవుతోంది…ఇక ఆర్నమెంట్ బంగారం గ్రాము 4300 కి అమ్మకాలు జరుగుతున్నాయి… దీనికి మళ్లీ టాక్సులు అధనంగా ఉంటాయి.

 

 

బంగారం ధర పెరిగితే.. వెండి రేటు కూడా పెరిగింది, వెండి ధర రూ.800 పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.71,300కు ట్రేడ్ అవుతోంది. వచ్చే రోజుల్లో బంగారం వెండి ధరలు భారీగాపెరిగే అవకాశం ఉంది అంటున్నారు బులియన్ వ్యాపారులు.. గడిచిన నాలుగు నెలలుగా చూస్తే తగ్గిన పుత్తడి మళ్లీ కొత్త రేటు దిశగా వెళుతోంది.