బీజేపీ జనసేన పార్టీ రెండూ మిత్రపక్షాలు దాదాపుగా ఏ అంశంపై అయినా రెండు పార్టీలు స్టాండ్ ఒక్కటే ప్రమాదాలు జరిగినా ప్రకృతి విపత్తులు జరిగినా సహాయ కార్యక్రమాలలో పరిహారం డిమాండ్ చేయడంలో రెండు పార్టీలు ఒకే మాటమీద కట్టుబడి ఉన్నాయి… అలాంటిది మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషయాకి వచ్చే సరికి ఎందుకో పవన్ కళ్యాణ్ లో మొహమాటం తట్టలేదని కొందరు చర్చించుకుంటున్నారు..
గతంలో కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గా ఉన్న సమయంలో జనసేన బీజేపీ వైసీపీని టార్కెట్ చేశారు… వీర్రాజు ఎపీసోడ్ స్టార్ట్ అయ్యాక వైసీపీ కంటే ఎక్కువగా టీడీపీని టార్గెట్ చేస్తున్నారు…
నేతలు రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తామన్నా భవిష్యత్ లో అధికారం లోకి వస్తామని చెబుతున్నా ఇవన్నీ కేవలం బీజేపీ రంకెలే … అయితే జనసేన నుంచి ఇలాంటి వ్యాఖ్యలనాలేవీ రాలేదు… పవన్ కళ్యాణ్ కనీసం చంద్రబాబు నాయుడు పేరెత్తడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు… టీడీపీ హయంలో జరిగిన అక్రమాలపై తమ ఘళాన్ని వినిపిస్తున్నారు బీజేపీ నేతలు… పోలవరం విషయంలో కూడా నిప్పులు చెరుగుతున్నారు… కానీ పవన్ మాత్రం నోరు మెదపడంలేదని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి…