టీడీపీకి బీద మస్తాన్ రావు ..రాజీనామా

టీడీపీకి బీద మస్తాన్ రావు ..రాజీనామా

0
80

తెలుగుదేశం పార్టీకి దారుణమైన షాక్ తగిలింది.. పార్టీ సీనియర్ నాయకుడు పారిశ్రామిక వేత్తగా పేరుగాంచిన టీడీపీ నాయకుడు నెల్లూరు నేత బీదమస్తాన్ రావు టీడీపీకి గుడ్ బై చెప్పారు.
ఆయన పార్టీకి గుడ్ బై చెప్పడం బాబుకు ఊహించని షాక్ అనే చెప్పాలి ..తాజాగా ఎమ్మెల్యే వంశీ కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు.

. ఈ రోజు తన రాజీనామా లెటర్ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి పంపించారని వార్తలు వస్తున్నాయి, వ్యక్తిగత కారణాల వల్ల తాను పార్టీకి రాజీనామా చేస్తున్నాను అని తెలియచేశారట. అయితే ఊహించని ఈ పరిణామం నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతలకు షాక్ కు గురిచేసింది.

ఆయన గత వారం రోజులుగా వైసీపీలో చేరుతారు అంటూ వార్తలు వినిపించాయి అంతేకాదు ఆయన రాజకీయంగా కీలక డెసిషన్ తీసుకుంటారు అని అందరూ అనుకున్నారు..కాని టీడీపీ నేతలతో టచ్ లో ఉండటంతో ఆయన పార్టీలో ఉంటారు అని అనుకున్నారు.. ఇటీవల ప్రభుత్వ కార్యక్రమానికి హజరైన ఆయన వైసీపీ నాయకులతో చర్చలు జరిపారు అని, వైసీపీలోకి ఆయనకు ఆహ్వనం వచ్చింది అని మీడియాలో వార్తలు వచ్చాయి… ఆయన మాత్రం తాను టీడీపీలో ఉంటాను అని తెలియచేశారు.. ఈలోపే రాజీనామా చేయడంతో అందరూ చర్చించుకుంటున్నారు.