ప్రయాణికులకు బిగ్ అలర్ట్..ఈనెల 31 వరకు 55 ప్యాసింజర్ రైళ్లు రద్దు

Big alert for passengers.. 55 passenger trains canceled till 31st of this month

0
86

కరోనా ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పలు ఫ్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్లు ప్రయాణికులను అలెర్ట్ చేసింది. ఈనెల 21 నుంచి 24వ తేదీ వరకు 55 రైళ్లను రద్దు చేసిన ద.మ.రైల్వే… ఈ రద్దును ఈనెల 31వ వరకు పొడగించినట్లు తాజాగా వెల్లడించింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలోనే రైళ్లు రద్దు చేసినట్లు ప్రకటించింది.

రద్దు చేసిన ప్రధాన రైళ్లు ఇవే..

కాచిగూడ-కర్నూల్ సిటీ, మేడ్చల్‌-ఉందానగర్ రైళ్లు రద్దు

కాజీపేట-సికింద్రాబాద్, కాచిగూడ-నడికుడ ప్యాసింజర్‌ రైళ్లు

తిరుపతి-కట్‌పడి, గుంతకల్-డోన్, కర్నూల్ సిటీ-గుంతకల్లు రైళ్లు రద్దు

మేడ్చల్ -సికింద్రాబాద్, సికింద్రాబాద్-ఉందానగర్ రైళ్లు రద్దు

మచిలీపట్నం-విజయవాడ, మచిలీపట్నం-గుడివాడ రైళ్లు రద్దు

రేపల్లె-తెనాలి, విజయవాడ-నర్సాపూర్ ప్యాసింజర్‌ రైళ్లు రద్దు

నర్సాపూర్-నిడుదవోలు ప్యాసింజర్ రైలు రద్దు