ప్రయాణికులకు బిగ్ అలర్ట్‌..నేడు పలు ఎంఎంటీఎస్‌ రైళ్ల రద్దు

0
105

హైదరాబాద్‌ వాసులకు ముఖ్య సూచన. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నగర పరిధిలోని 20 ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దూ చేస్తూ దక్షిణ మధ్య రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. నిర్వహణ పనుల కారణంగా కొన్ని ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ 20 ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు నిర్ణయం కేవలం ఇవాళ ఒక్క రోజే మాత్రమే అని అధికారులు సూచించారు.

రద్దు అయిన రైళ్లు ఇవే.. 

లింగంపల్లి – హైదరాబాద్, హైదరాబాద్‌ – లింగంపల్లి, ఫలక్‌ నుమా – లింగంపల్లి, లింగంపల్లి – ఫలక్‌ నుమా మార్గాల్లో కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రయాణం చేయాలని అధికారులు సూచనలు ఇచ్చారు. ఈ 20 ఎంఎంటీఎస్‌ రైళ్లు రేపటి నుండి ఎప్పటి లాగే నడుస్తాయని స్పష్టం చేసింది దక్షిణ మధ్య రైల్వే శాఖ.