కొద్దికాలంగా ఏపీలో ప్రతిపక్ష పాత్రను తెలుగుదేశంపార్టీకి బదులు భారతీయ జనతా పార్టీ పోసిస్తోందా అంటే అవుననే సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి… ప్రస్తుతం టీడీపీలో మాజీ మంత్రులు ఎమ్మెల్యేల తీరు పలుకేసుల్లో ఇరుక్కోవడంతో ఆపార్టీకి నిద్రలేకుండా చేస్తోంది… గత కొద్దిరోజుల వరకు విమర్శలను చేసిన టీడీపీ తాజాగా వరుసగా అరెస్టులు కావడంతో ప్రజా సమస్యలను వదిలేసి సొంత పార్టీ నేతలను కాపాడుకునే పనిలో పడింది…
ఇక దానికి తగ్గట్లు ప్రస్తుత ఎమ్మెల్యేలు మాట వినకపోవడం మరికొంతమంది పార్టీ మారే అవకాశం ఉండటంతో తెలుగుదేశం పార్టీ తీవ్ర గందర గోళంలో ఉంది… ఈక్రమంలో బీజేపీ మాత్రం తనదైన శైలిలో ప్రవర్తిస్తోంది… 108,104 అంబులెన్స్ ల కొనుగోలు విషయంలో అవినీతి జరిగిందని ఆరోపించడంతోపాటు ఇసుక సమస్య పీపీ ఈ కిట్ల విషయంలో ఇలా ప్రతీ దానికీ ప్రభుత్వంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుంది…
ఇక ఇదే క్రమంలో బీజేపీ విమర్శలకు వైసీపీ కూడా సమాధానం చెబుతోంది… కాపుల రిజర్వేషన్ గురించి ప్రస్తావించడంతోపాటు అమరావతి రైతులు పక్షాణ నిలబడటం బీజేపీకి బాగానే కలిసి వచ్చాయని చెప్పాలి దీంతో ప్రజా సమస్యలకు ప్రత్యామ్నాయం బీజేపీనే అనే సంకేతాలు వస్తున్నాయి…