బాబు కు బిగ్ షాక్ జగన్ కు జై కొట్టిన బీజేపీ

బాబు కు బిగ్ షాక్ జగన్ కు జై కొట్టిన బీజేపీ

0
92

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ ప్రతిష్టాత్మకంగా వైఎస్సార్ రైతు భరోసా పథకం నేడు అమలు చేశారు… పాదయాత్రలో భాగంగా ఎక్కడైతే ఈ పథకం గురించి హామీ ఇచ్చారో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అదే జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించారు జగన్.

ఈ పథకంపై బేజేపీ హర్షం వ్యక్తం చేసింది… నిన్నా మొన్నటివరకు ఒంటెద్దుకాలలా లేచిన కన్నా ఇప్పుడు వైసీపీ సర్కార్ పై హర్షం వ్యక్తం చేశారు.. ఈమేరకు ట్వీట్ కూడా చేశారు.. మోదీ గారు రైతులకు అందించే కేంద్ర నిధులు రూ.6000 కు రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ కలిపి “YSR రైతు భరోసా-PM కిసాన్”గా ఇవ్వడం హర్షణీయం అని అన్నారు.

గత సర్కారులా కాక ఇకపై కేంద్రం నిధులతో ఇచ్చే వివిధ సంక్షేమ పథకాలకు ప్రధానమంత్రి పేరు తప్పనిసరిగా జత చేసి లబ్ధిదారులకు అందచేయాలి కోరారు…