ఎన్టీఆర్ నాటి నుంచి 2014 ఎన్నికల వరకు విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట… ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా ఇక్కడ టీడీపీ మెజార్టీ స్థానాలను గెలుచుకుని పచ్చ జెండా ఎగరవేసేది… కానీ 2019 లో సీన్స్ రివర్స్ అయింది… ఆ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను వైసీపీ గెలుచుకుంది… టీడీపీ కేవలం నాలుగు స్థానాలను గెలుచుకుంది… అయితే అందులో ఒక ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు వైసీపీ లో చేరుతారంటూ కొద్దికాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే…
కానీ ఇంత వరకు ఆయన చేరలేదు… ఇక మరో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ అధికారికంగా వైసీపీకి మద్దతు ప్రకటించారు… ఆయన కుమారుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు…
ఇక ఈ షాక్ నుంచి చంద్రబాబు నాయుడు కోలుకోకముందే మరో బిగ్ షాక్ తగిలింది… ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే గణబాబు వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి… వచ్చే నెల 5న సీఎం జగన్ సక్షంలో వైసీపీ తీర్థం తీసుకునేందుకు సిద్దమయ్యారని వార్తలు వస్తున్నాయి..