రాయలసీమలో ఫలితాలకు ముందే బాబుకు బిగ్ షాక్

రాయలసీమలో ఫలితాలకు ముందే బాబుకు బిగ్ షాక్

0
104

రాయలసీమ ప్రాంతం ఈ ఐదు సంవత్సరాలు తాను అభివృద్ది చేశాను అని, ఈ ఎన్నికల్లో తమ పార్టీ కచ్చితంగా గెలుస్తాము అని చంద్రబాబు చెబుతున్నారు.. కాని వాస్తవంగా ఇక్కడ వైసీపీ వేవ్స్ బలంగా ఉన్నాయి అని సర్వేలు చెబుతున్నాయి.. తెలుగుదేశం సర్వేలు ఎలా ఉన్నా, ఇక్కడ మాత్రం వైసీపీ గెలుపు నల్లేరుమీద నడక అని చెబుతున్నారు అందరూ, అంతేకాదు గత ఎన్నికల్లో కూడా మెజార్టీ స్ధానాలు వైసీపీ గెలుచుకుంది.. ఇవన్నీ చూస్తుంటే ఈసారి ప్రజా వ్యతిరేకత, పార్టీ ఫిరాయింపులు, జగన్ పై వేధింపులు, పార్టీ నేతలపై కేసులు, ఇవన్నీ కూడా టీడీపీ పై వ్యతిరేకతను మరింత పెంచాయట. జగన్ పాదయాత్ర అలాగే వైయస్ స్వర్ణయుగం రావాలి అంటే జగన్ రావాలి అని పిలుపు ఇచ్చారు, ఇక నరవత్నాలు కూడా ఈసారి రాయలసీమలో ప్రజలను ఆకర్షించాయి, అందుకే వైసీపీకే మెజార్టీ సీట్లు వస్తాయి అని చెబుతున్నారు, మరి తాజాగా వచ్చిన సర్వేలో రాయలసీమలో వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయో చూడండి.

చిత్తూరు జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉంటే..
టీడీపీ : 5
వైసీపీ : 8
జనసేన : 1

కడప జిల్లాలోని మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉంటే..
టీడీపీ : 2
వైసీపీ : 8

కర్నూలు జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉంటే..
టీడీపీ : 8
వైసీపీ : 6

అనంతపురం జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉంటే..
టీడీపీ : 2
వైసీపీ : 12