వైసీపీ సర్కార్ మూడు రాజధానుల ప్రకటన చేసినప్పటి నుంచి అమరావతిలో రైతులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు… మూడు రాజధానులు వద్దు అమరావతినే ముద్దు అంటూ ధర్నాలు చేస్తున్నారు రైతులు… వీరు 60 రోజు పాటు దీక్షలు చేస్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోకుంది…
కానీ జనసేన అధినేత పవన్ మాత్రం మొదటి నుంచి రైతులకు మద్దతుగా నిలుస్తున్నారు… అవకాశం దొరికితే చాలు రాజధానిలో పర్యటించి వారికి మద్దతు ప్రకటిస్తూనే ఉన్నారు… ఇక ఆయన స్పీడ్ ను గమనించిన కేంద్రం ఆయన్ను ఢిల్లీకి పిలిపించుకుని పొత్తు కుర్చుకుంది…
ఇక నుంచి కలిసి పనిచేస్తామని చెప్పారు.. అయితే ఇటీవలే పవన్ కర్నూల్ కు తానొక్కరే వెళ్లారు.. ర్యాలీలో పాల్గొని అక్కడినుంచి అమరావతికి చేరుకున్నారు.. రైతులకు సంఘీభావం ప్రకటించారు అయితే ఆయన టూర్ లోఎక్కడా బీజేపీ నేతలు కనిపించలేదు.. ప్రస్తుతం దీని గురించి సోషల్ మీడియాలో చర్చలు జరుగుతోంది…..