విద్యార్థులకు బిగ్ షాక్..ఫీజులు పెంచుతూ ఉత్తర్వులు జారీ

Big shock to students .. Orders issued to increase fees

0
108

విద్యార్థులకు తెలంగాణ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ప్రైవేటులో వైద్య విద్య భారం మరింత పెరగనుంది. రాష్ట్రంలో మొత్తం 23 వైద్య కళాశాలలు ఉండగా ఏడింటిలో ఎంబిబిఎస్, బీడీఎస్ కోర్సుల్లో యాజమాన్య, ప్రవాస భారతీయ కేటగిరిలో ఫీజులు పెంచుతూ తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో విద్యార్ధులపై భారం పడనుంది.

తెలంగాణ ప్రవేశాలు అలాగే ఫీజుల నియంత్రణ కమిటీ ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైద్య వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పెంచిన ఫీజులు 2021-22 వైద్య విద్యా సంవత్సరం నుంచి అమలు అవుతాయి. రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలలో బి, సి కేటగిరిలో ప్రవేశాలకు కాలోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రవేశ ప్రకటన జారీ కావడంతో తదనుగుణంగా తాజాగా ఆరోగ్యశాఖ.

కరీంనగర్ జిల్లాలోని చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజ్, ఎల్బీనగర్లోని కామినేని అకాడమీ, నార్కట్ పల్లి లోని కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మహబూబ్నగర్లోని ఎం.ఎన్.ఆర్ మెడికల్ కాలేజీలో బి కేటగిరీ ఫీజును 13 లక్షలకు పెంచారు. అలాగే సీక్రెట్ గిరి కింద 20 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అపోలో, మల్లారెడ్డి అలాగే ఎస్వీఎస్ మెడికల్ కాలేజీలో బి కేటగిరీ ఫీజును 12.50 లక్షలకు, వీటిలో సి కేటగిరి ఏడాదికి 25 లక్షలు చెల్లించాలి.