Flash News- తెలంగాణ కాంగ్రెస్‌కు బిగ్ షాక్‌..!

Big shock to Telangana Congress ..!

0
97

తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తగలనుంది. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌ సాగర్‌రావు కాంగ్రెస్‌ను వీడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్‌ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి, ప్రేమ్‌ సాగర్‌ మధ్య విభేదాలు ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడిని మార్చాలని ప్రేమ్‌ సాగర్‌రావు కాంగ్రెస్‌ అధిష్టానాన్ని డిమాండ్‌ చేశారు. మరికొన్ని మండలాల అధ్యక్షులను కూడా మార్చాలని ఆయన డిమాండ్‌ చేశారు.

కానీ ప్రేమ్‌సాగర్‌రావు డిమాండ్లను తెలంగాణ పీసీసీ సీరియస్‌గా తీసుకోలేదని సమాచారం. ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌ సాగర్‌రావు కాంగ్రెస్‌ పార్టీని వీడే అవకాశం ఉన్నట్లు జిల్లా రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. త్వరలోనే ‘ఉత్తర తెలంగాణ ఇందిరా కాంగ్రెస్‌’ పేరుతో పార్టీ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.