భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబించే భారత్ లో వేల కులాలు అనేక మతాల నడుమ సఖ్యత చాటి చెప్పుతూ సర్కార్లు నడుచుకోవాల్సి ఉంది.ఇందులో ఏ మాత్రం గాడి తప్పిన సమాజంలో అశాంతి రేగేలా ఆయా వర్గాలు రెచ్చిపోయే ప్రమాదం ఉంది. ప్రపంచ మహమ్మారి కరోనా విజృంభిస్తున్న వివిధ మతాల ఛాందస వాదులు పండగలు పబ్బాలు కోసం నిబంధనలను గాలికి వదిలి వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు.
దీనిపై ప్రభుత్వాలు చూసీ చూడనట్లే పోతున్నాయి. ఎవరిని అంటే ఎవరు కోపం వస్తుందో అనే భయంతో పండుగలకు సంబంధించి జరిగే కార్యక్రమాలను పెద్దగా అడ్డుకోలేని పరిస్థితి ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో బక్రీద్ బోనాల పండగ వినాయక చవితి మొదలైన పండుగలు జరగనున్నాయి.
తెలుగు రాష్ట్రాలలో బోనాలు పండుగ, వినాయక చవితి ఉత్సవాలకు ఇప్పటి నుంచే గట్టి సన్నాహాలు ఆయా కమిటీలు చేస్తున్నాయి. నిబంధనలు పాటిస్తూ ఊరేగింపులు , కార్యక్రమాలు చేస్తామని మరీ ప్రకటించేస్తున్నాయి. కొందరు ప్రభుత్వం అనుమతులను పెండింగ్ లో పెట్టడంతో కోర్టుకి వెళ్లి మరీ కార్యక్రమం జరపాల్సింది అంటున్నారు