బిగ్ బ్రేకింగ్ …ఎస్వీబీసీ చైర్మన్ ని ఫిక్స్ చేసిన జగన్

బిగ్ బ్రేకింగ్ ...ఎస్వీబీసీ చైర్మన్ ని ఫిక్స్ చేసిన జగన్

0
88

సినీనటుడు, ఎస్వీబీసీ చైర్మన్ పృధ్వీ మహిళా ఉద్యోగినితో మాట్లాడిన కాల్ వైరల్ కావడంతో ఆయనపై తీవ్రస్ధాయిలో విమర్శలు వచ్చాయి, ధార్మిక సంస్థలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంపై జగన్ సర్కార్ సీరియస్గా స్పందించింది. ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ దీంతో ఆ పదవికి రాజీనామా చేశారు.

పక్కా ప్లాన్ ప్రకారమే తనను టార్గెట్ చేశారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఆడియో టేపులతో తనకెలాంటి సంబంధం లేదని.. ఉద్దేశపూర్వకంగా జరిగిన కుట్రగా అభివర్ణించారు. తనపై ఆరోపణలు వచ్చినందునే రాజీనామా చేస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. మరి తాజాగా ఈ పదవి ఎవరికి రానుంది అనేది చర్చ జరుగుతున్న అంశం…తాజాగా తెరపైకి మరో కొత్త పేరు వచ్చింది.

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్గా జర్నలిస్ట్ స్వప్నను నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె ఎస్వీబీసీ డైరెక్టర్గా సేవలు అందిస్తున్నారు… అయితే పృధ్వీ పదవికి రాజీనామా చేయడంతో, స్వప్న పేరు తెరపైకి వచ్చింది. డైరెక్టర్గా ఉన్న స్వప్న.. చైర్మన్గా బాధ్యతలు స్వీకరించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో సాక్షిలో కూడా పెద్ద ఉద్యోగం చేశారు, అయితే నేడు లేదా రేపు దీనిపై ప్రకటన రానుందని వార్తలు వస్తున్నాయి.