బిగ్ బ్రేకింగ్ వైసీపీలోకి కేఈ ఫ్యామిలీ

బిగ్ బ్రేకింగ్ వైసీపీలోకి కేఈ ఫ్యామిలీ

0
85

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది…. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు సైకిల్ దిగాలని ఆలోచిస్తున్నారు…. దశాబ్దాలపాటు టీడీపీలో కొనసాగిన కేఈ ఫ్యామిలీ ఇప్పుడు వైసీపీలో చేరేందుకు సిద్దమైనట్లు వార్తలు వస్తున్నాయి….

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేఈ ఫ్యామిలీ కర్నూల్ జిల్లాను ఒంటిచెతితో నడిపారు… 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి గెలిచిన కేఈ కృష్ణ మూర్తి డిప్యూటీ సీఎం అయ్యారు… ఇక ఆయన వయస్సు మీద పడటంతో 2019 ఎన్నికల్లో ఆయన కుమారుడు శ్యాంబాబు టీడీపీ తరపున పోటీ చేసి వైసీపీ అభ్యర్థి కంగాటి శ్రీదేవి చేతిలో ఓటమి చెందారు…

ఇక పార్టీ కూడా అధికారం కోల్పోవడంతో కేఈ ఫ్యామిలీ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంది… దశాబ్దాల కాలం పాటు నుంచి కోట్ల ఫ్యామిలీకి కేఈ ఫ్యామిలీకి పచ్చగడ్డి వేస్తు భగ్గుమనేంత వైర్యం ఉండేది… కానీ చంద్రబాబు నాయుడు కోట్ల ఫ్యామిలీని ఎన్నికల ముందు టీడీపీలో చేర్చుకున్న సంగతి తెలిసిందే…