బిగ్ న్యూస్ జగన్ సమక్షంలో వైసీపీలోకి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు…

బిగ్ న్యూస్ జగన్ సమక్షంలో వైసీపీలోకి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు...

0
85

ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మరో బిగ్ షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయి… కరోనా టైంలో కూడా ఏపీలో వలసలు కొనసాగుతున్నాయి… ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు ఎక్కువ అవుతున్నాయి ఇప్పటికే చాలామంది తమ్ముళ్లు సైకిల్ దిగి ఫ్యాన్ కింద రెస్ట్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే…

అలాగే ఇద్దరు ఎమ్మెల్యేలు సైకిల్ కు రెబల్ గా మరారు… ఇక ఈ షాక్ నుంచి చంద్రబాబు నాయుడు కోలుకోకముందే మరో షాక్ తగలబోతోంది… ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారు… పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు అలాగే రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లు టీడీపీని వీడి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం తీసుకునేందుకు రెడీ అయ్యారు…

అన్నీ కుదిరితే ఈరోజు వారు సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్ధం తీసుకోనున్నారు… ఇప్పటకే ఈ ఇద్దరి ఎమ్మెల్యేలతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది….

ఇక వీరు పార్టీ తీర్ధం తీసుకున్న తర్వాత మరికొంత మంది టీడీపీ ఎమ్మెల్యేలు పక్క చూపులు చూసేందుకు సిద్దమయ్యారని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు మరి అధిష్టానం వారికి ఎలాంటి భరోసా ఇస్తుందో చూడాలి..