బాబుకు బిగ్ షాక్ టీడీపీ కంచుకోటలో కీలక నేత రాజీనామా

బాబుకు బిగ్ షాక్ టీడీపీ కంచుకోటలో కీలక నేత రాజీనామా

0
92

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దెబ్బమీద దెబ్బ తగులుతోంది… ఈ ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోవడంతో మెల్లగా పార్టీనుంచి ఒక్కొక్కరు జారుకుంటున్నారు… అది కూడా టీడీపీ కంచుకోట నుంచి ఇతర పార్టీల్లోకి వెళ్లడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది…

ఇప్పటికే నలుగురు రాజ్యసభ సభ్యులను కోల్పోయిన టీడీపీ తర్వలో మరో కీలక నేతను కోల్పోనుంది. విశాఖ జిల్లా టీడీపీ సీనియర్ నేత జిల్లా గ్రాంథాలయ మాజీ చైర్మన్ తోట నగేష్ త్వరలో పార్టీకి రాజీనామా చేయనున్నారు… పార్టీ అధికారం కోల్పోవడంతో పాయకరాపుపేటలో టీడీపీ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయారు… దీంతో ఈ రెండు వర్గాలు ఒకటిగా కలిసే అవకాశం లేకపోవడంతో ఆయన టీడీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు… ఈ మేరకు బీజేపీ నాయకులతో మంతనాలు కూడా జరిపారు