Flash: పోలీస్ వేధింపులకు బీజేపీ కార్యకర్త మృతి..

0
92

తెలంగాణాలో విషాదం చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాకు చెందిన బీజేపీ యువనేత,ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త  సామినేని సాయిగణేష్ పోలీస్ వేధింపులకు ఆత్మహత్య చేసుకున్నాడు. పది రోజుల్లో పెళ్లిచేసుకొని ఆనందంగా ఉండాల్సినవాడు పోలీస్ వేధింపుల కారణంగా కానరాని లోకానికి వెళ్ళిపోయాడు. తన డివిజన్ లో బీజేపీ పార్టీ దిమ్మను నిర్మించడంతో..టీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు వాగ్వాదానికి దిగారు.

ఈ విషయంపై పోలీసులకు పిర్యాదు చేయడంతో..ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు స్వీకరించకపోవడమే కాకుండా ఇష్టమొచ్చినట్టు తిట్టారు. అంతేకాకుండా పోలీసులు తన కుమారుడిపై 16 కేసులు పెట్టి రోజు పోలీస్ స్టేషన్ కు రావాలంటూ వేధిస్తున్నారని తల్లి సావిత్రమ్మ ఆరోపించింది. అందువల్లే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిపింది.