బీజేపీ, ఆరెస్సెస్ దేశాన్ని విభజిస్తున్నాయి..రాహుల్ గాంధీ సెన్సేషనల్ కామెంట్స్

0
131

భాజపా, ఆరెస్సెస్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో విద్వేషం పెరిగిందని, భాజపా, ఆరెస్సెస్ దేశాన్ని విభజిస్తున్నాయని మండిపడ్డారు. ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా దిల్లీలోని రాంలీలా మైదానంలో ఏర్పాటు చేసిన భారీ నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.

ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, విద్వేషం పెరగడం.. వల్ల దేశం బలహీనంగా మారుతోంది. దేశంలో భయం, విద్వేషం నెలకొనడం వల్ల ఇద్దరు పారిశ్రామికవేత్తలు లాభపడుతున్నారు. వారి ప్రయోజనాల కోసమే భాజపా పని చేస్తోంది. కేంద్రం తీసుకొచ్చిన మూడు నల్ల వ్యవసాయ చట్టాలు కూడా రైతుల కోసం కాదు. ఇద్దరు, ముగ్గురు పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కల్పించేందుకే.

యువతకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. పార్లమెంట్​లో విపక్షాల గొంతుకను మోదీ అణచివేస్తున్నారు. మీడియా, న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం.. ఇలా అన్ని వ్యవస్థలపైనా ప్రభుత్వం దాడులకు పాల్పడుతోంది. మోదీని ఎవరు విమర్శించినా విడిచిపెట్టడం లేదు. నన్ను ఈడీ ముందు 55 గంటలు కూర్చోబెట్టారు. మోదీజీ, నేను మీ ఈడీకి భయపడను.