టీడీపీతో పొత్తుపై బీజేపీ ఫుల్ క్లారిటీ

టీడీపీతో పొత్తుపై బీజేపీ ఫుల్ క్లారిటీ

0
84

వచ్చే ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పాత మిత్రులు అయినటు వంటి భారతీయ జనతా పార్టీతో పొత్తుపెట్టుకుని ఏపీలో మరోసారి పోటీ చేస్తారని కొద్దికాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే చంద్రబాబు నాయుడు కూడా ఈ వార్తలకు బలం చేకూర్చేలా మాట్లాడారు…

తనకు ప్రధాని మోడీతో ఎలాంటి బేధాలు లేవన రాష్ట్ర విభజన హామీల విషయంలో విభేదాలు వచ్చాయని వ్యక్తిగతంగా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని విశాఖ లో తెలిపిన సంగతి తెలిసిందే… దీనిపై బీజేపీ క్లారిటీ ఇస్తూనే ఉంది. తాము ఎట్టి పరిస్థితిలో టీడీపీతో పొత్తు పెట్టుకునేప్రసక్తే లేదని అన్నారు…

తాజాగా ఇదే విషయాన్ని సుజనా కూడా స్పష్టం చేశారు.. ప్రస్తుతం ప్రాంతీయ పార్టీల్లో వారసత్వ రాజకీయాలు ఎక్కువు అవుతున్నాయని అన్నారు… అందుకే తాను జాతీయ పార్టీల వాదాన్ని ప్రజల్లో తీసుకు వెళ్తామని అని అన్నారు.. ఇంతకు ముందు ప్రాంతీయ పార్టీలు వేరు ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు వేరని అన్నారు.. అందుకే తాను ఏ పార్టీతో పోత్తు పెట్టుకోమని బీజీపీ రాష్ట్రంలో ఓంటరిగా పోటీ చేస్తుందని అన్నారు…