టీడీపీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న బీజేపీ

టీడీపీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న బీజేపీ

0
130

ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ విషయంలో భారతీయ జనతా పార్టీ కిలక నిర్ణయం తీసుకుంది… సత్తా ఉన్న వల్లభనేని వంశీ లాంటి నాయకులు బీజేపీలోకి రావచ్చని పిలుపునిచ్చింది… అలాంటి వారు ఎవరైనా ఉంటే తమ పార్టీలోకి రావచ్చని సుజనా చౌదరి స్పష్టం చేశారు.

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఇటీవలే ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బీజేపీని సంప్రదించి తన బాధను చెప్పుకున్నారని తెలిపారు… నిజాయితీగా ఉన్న వారికి బీజేపీ ఎప్పుడు అండగా ఉంటుందని అన్నారు… కాగా వల్లభనేని వంశీ నిన్న టీడీపీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే…

ఆయన రాజీనామా చేయకుముందు రెండు రోజుల్లో చంద్రబాబు నాయుడు ఆ తర్వాత సుజనాని అలాగే బాల్యమిత్రుడు కొడాలి నానిలను కలిశారు. దీంతో అప్పటినుంచి ఆయన పార్టీ మారుతారని ప్రచారం జరిగింది…