రాంగోపాల్ వర్మకు బీజేపీ గ్రీన్ సిగ్నల్

రాంగోపాల్ వర్మకు బీజేపీ గ్రీన్ సిగ్నల్

0
51

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా విలక్షణంగా మారుతోంది… ఆయన దర్శకత్వంలో వస్తున్న చిత్రాలన్ని సంచలనాలుగా మారుతున్నాయి… గతంలో తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనంగా మరిందో అందరి తెలిసిదే.

ఇప్పుడు కమ్మరాజ్యంలో కడపరెడ్లు చిత్రం కూడా అంతే సంచలనంగా మారుతోంది… దిపావళి కానుకగా వదిలిన ట్రైలర్ సోషల్ మీడియలో సంచలనంగా మారుతోంది… తాజాగా ఈయనపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు…

రాయలసీమపై వర్మకు అభిమానం ఉంటే మంచి సినిమా తీస్తే బాగుంటుందని అన్నారు… తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో హైకోర్టుతో పాటు రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు… రాయలసీమ డిక్లరేషన్ అమలు అయ్యేవరకు తమ పోరాటం ఆగదని అన్నారు..