పవన్ కు బిగ్ షాక్ జనసేనకు హ్యాండ్ ఇచ్చిన బీజేపీ….

పవన్ కు బిగ్ షాక్ జనసేనకు హ్యాండ్ ఇచ్చిన బీజేపీ....

0
206
Pawan Kalyan

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు మరో బిగ్ షాక్ తగిలింది…. తెలంగాణలోని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనుందని ఇటీవలే పార్టీ అధినేత పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే…

కార్యకర్తలు, యువనాయకుల కోరిక మేరకు పోటీ చేయనున్నామని ఈమేరకు పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు… అయితే ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కనుక బీజేపీ జాతీయ పార్టీ అయినందున తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని అందరు భావించారు…

కానీ కలిసి పోటీ చేయమని తెలిపారు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్… తాము ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేయడంతో పొత్తు ఉండదని తెలిపారు… పవన్ తో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని ఎవరి మధ్య వర్తిత్వం అవసరం లేదని, అవసం అయితే నేరుగా వెళ్లి పవన్ తో చర్చిస్తామని బండి సంజయ్ తెలిపారు…