Breaking- తీన్మార్ మల్ల‌న్నకు బీజేపీ హైకమాండ్ వార్నింగ్..!

BJP high command warns teen wrestlers ..!

0
70

తీన్మార్ మల్లన్న ఇటీవల బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన క్యూ న్యూస్ పేరుతో ఓ యూట్యూబ్ ఛానల్‌ నిర్వహిస్తున్నారు కూడా. ఆయన తన యూట్యూబ్ ఛానల్‌లో నిర్వహించిన ఓ పోల్ వివాదాస్పదం అయ్యింది. దీనితో తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

‘అభివృద్ధి ఎక్కడ జరిగింది.. భద్రాచలం గుడిలోనా? హిమాన్షు శరీరంలోనా?’ అంటూ తీన్మార్‌ మల్లన్న పోల్‌ నిర్వహించడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ట్వీట్ ద్వారా కేటీఆర్ ఫిర్యాదు చేశారు. తాజాగా తీన్మార్ మల్ల‌న్నకు బీజేపీ పార్టీ దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చింది.

తీన్మార్‌ మల్లన్న వ్యాఖ్యలపై బీజేపీ నాయకత్వం ఆరా తీస్తోంది. కేటీఆర్ కుటుంబ సభ్యులను విమర్శించడంపై సీరియస్‌గా ఉంది పార్టీ నాయకత్వం. తీన్మార్‌ మల్లన్నకు వార్నింగ్‌ ఇచ్చే ఆలోచనలో ఉంది. వ్యక్తిగత విమర్శలు తమ పార్టీ సిద్ధాంతం కాదని బీజేపీ నాయకుడు ప్రకాష్‌రెడ్డి స్పష్టం చేశారు.